Sunday, July 3, 2011

What a life of software people

కాలేజి లో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు అయిపోతాయ్, exams నుంచి విముక్తి  ఎప్పుడు వస్తుంది, job లో డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాం అని తొందర పడతాం.  job search లో నా .. నా తిప్పలు పడి కనపడిన ప్రతి company interview attend అయి, ఏదోలా job సంపాదిస్తాం.


Job join.

First month - no work.only enjoy - all happies
Second month - work + enjoy – ok
Third month - only work. no enjoy - problem starts





అప్పటికి office politics తెలుస్తాయ్.

పక్క team లో manager మంచోడు అయుంటాడు.

పక్క team లో అమ్మాయిలు బావుంటారు.

పక్క team లో hikes బాగా ఇస్తారు.

పక్క team లో work అసలే ఉండదు.

మనకి మాత్రం రోజు festival..



చేసిన పనికి ... చెయ్యని పనికి దొబ్బించుకోవటమే. ఒక్కో client ఏమో పిచ్చి నా .. requirements ఇస్తాడు. అవి పని చెయ్యవు అని తెలిసి కూడా అలానే చెయ్యాలి. అర్ధ రాత్రి support లు. onsite వాడిని బూతులు తిట్టి పారిపోదాం అనిపిస్తుంది. కానీ office లో net connection free and coffee free అనే ఒక్క ఆలోచన ఆపేస్తుంది. మనకి ఒక batch తయారవుతుంది.


ప్రతి రోజు TL, PM ని తిట్టుకుంటూ ఒక ఆరు నెలలు గడిపేస్తాం. ఇలా loop లో పెట్టి కొడితే రెండు ఏళ్ళు అయిపోతాయ్. అప్పటికి కళ్ళ చుట్టూ black circles, వేళ్ళు వంకర్లు, మెడ నొప్పులు ... పిచ్చ నా .. జబ్బులు అన్ని వచ్చేసి ఉంటాయ్. సొంత అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడి నే చుట్టం చూపుగా చూడటానికి వెళ్తుంటాం. ఒక వేళ bro/sis ఉంటే, వాళ్ళే .. s/w field లో ఉంటే .. అర్ధం చేసుకొని తిట్టటం మానేస్తారు. అలా లేకపోతే phone చేసిన ప్రతిసారి  సంజాయిషీ.


salary పడుతూ ఉంటుంది. bonds కి అని, mutual funds కి అని, credit card bills కి అని కట్టి కట్టి .. సంపాదించింది అంతా ధార పోస్తాం. ఇంకేమన్నా మిగిలితే తెలివైనోడు అయితే home loan మీద, మనలాంటి వాడు అయితే గాలి తిరుగుడు మీద తగలేసేస్తాం.


ఇలా జీవితం ప్రశాంతంగా సాగుతూ .. ఉండగా one fine day ఎవడో ఒక ex-colleague / colleague పెళ్లి settle అయింది అని పిలుస్తాడు. మనకి ఒక అమ్మాయ్ ఉంటే బావుండు అనే ఒక వెర్రి ఆలోచన పుడుతుంది. మన s/w field లో బావున్న అమ్మాయిలు అంతా booked, married or north indians అయి ఉంటారు. అక్కడే వంద లో 95 మంది filter అయిపోతారు. మిగతా ఐదు లో 4 మందిని "friend" కంటే అక్కా.. అని పిలవటం better అనేటట్టు ఉంటారు. ఆ మిగిలిన ఒక్క అమ్మాయ్ కోసం team అంతా కొట్టేసుకుంటూ ఉంటాం. ఆ అమ్మాయ్ ఎవరితోనూ commit అవ్వకుండానే అందరితో free గా బతికేస్తూ.. ఉంటుంది. One more fine day పెళ్లి card ఇస్తుంది. ఇంకేముంది Heart breaking లా దేవదాస్ లా గడ్డం పెంచేసుకొని .. ఆ అమ్మాయి మంచిది కాదు అని deciding. next day నుంచి
ఇంకొకళ్ళకి trying.



Reviews వస్తాయ్. "నువ్వు excellent, నువ్వే లేనిదే company లేదు, కత్తి, కేక, కమాల్, etc, etc ... " అని చెప్పి ఊరించి చివర్లో .. "but" అంటారు. తీరా చూస్తే నీ salary లో ఇంకో సనక్కాయ్ పెంచాం, పో .. అంటారు. Resume update cheyyali అని గత ఆరు నెలలు గా తీస్కుంటున్న decision ని మళ్ళా ఒకసారి స్మరించుకుని ..  అలా  ఇచ్చిన సనక్కాయల మీద బతికేస్తుంటాం.


జీవితం అంటే దూరదర్శన్ లో హైదరాబాద్ ప్రసారం లానే ఉంటుందా... వేరే ప్రోగ్రామ్స్ ఏమి ఉండవా..!!! ఛీ.. ఎదవ జీవితం!!!


What a life of software people ....

4 comments:

  1. Sir, Is this your personal experience?

    ReplyDelete
  2. Very Good Anil...........Very Nice..........:))

    ReplyDelete
  3. wav lovely..fantastic wat a poem cum story...awsum sir..

    ReplyDelete